పదో తరగతి పరీక్షల భవితవ్యం తేల్చనున్న కేసీఆర్: కొద్దిసేపట్లో కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా అన్న ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా అన్న ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చించడంతో పాటు పరీక్షలు నిర్వహించాలా..? లేక అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడ్‌లు ఇవ్వాలా అన్నదానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read:టెన్త్ పరీక్షల నిర్వహణపై 8న కేసీఆర్ సమీక్ష: ఎగ్జామ్స్ ఉంటాయా, పాస్ చేస్తారా?
ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఇప్పటికే నివేదిక తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్ ఇచ్చి విద్యార్ధులను పాస్ చేసే దిశగా సర్కార్ యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇక్కడ సవాల్ ఏంటంటే గ్రేడింగ్ ఏ విధంగా ఇవ్వాలి... ఏ విద్యార్ధికి ఎలాంటి గ్రేడింగ్ ఇస్తారోనని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో పరీక్షల నిర్వహణ అనేది కత్తి మీద సాములా తయారైంది.
Also Read:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా
లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కూడా కొన్ని లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వారందరికీ సెంటర్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి.. భౌతిక దూరం, దీనికి తోడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఎంతోమంది విద్యార్ధులను తొలగించడంతో ఇన్విజిలేటర్ల కొరత వేధిస్తోంది.
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రం మొత్తం పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించినా కూడ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు జూలై 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.