తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ssc exams postponed in telangana

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.పరీక్షల విషయమై నిర్ణయం తీసుకొనేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 7వ తేదీన అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

also read:జూన్‌ 8 నుండి తెలంగాణలో టెన్త్ పరీక్షలు, జీహెచ్ఎంసీలో ఎగ్జామ్స్‌ కు నో

జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో మినహాయించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడ టెన్త్ పరీక్షలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించుకొనేందుకు అనుమతి ఇచ్చింది.

ssc exams postponed in telangana

ఈ తీర్పు కాపీ అందిన తర్వాత పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. శనివారం నాడు సాయంత్రం పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ప్రభుత్వానికి చేరింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కొన్ని చోట్ల పరీక్షలు నిర్వహించడం మరికొన్ని చోట్ల పరీక్షలు జరపకపోవడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని సర్కార్ అభిప్రాయపడింది.దీంతో ఈ నెల 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు నిర్వహించడం లేదు. 

ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే విషయమై కూడ ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఫ్రీ ఫైనల్ పరీక్షల ప్రాతిపదికన అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ ఈ నెల 7వ తేదీన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో టెన్త్ పరీక్షలపై నిర్ణయం తీసుకొంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios