ఆర్టీసీ సమ్మె, శనివారం కార్మికుల చలో ట్యాంక్‌బండ్, హైకోర్టు వరుస విచారణల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఏజీ బీఎస్ ప్రసాద్, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించి త్వరితగతిన పరిశీలించాలన్న హైకోర్టు సూచనపై సీఎం చర్చిస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణలో భాగంగా 5,100 బస్సులకు రవాణాపరమైన అనుమతుల విషయంలో ముందుకెళ్లరాదన్న న్యాయస్థానం ఆదేశాలపైనా అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నారు. రెండు తీర్పుల ప్రతులను సీఎం పరిశీలించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

Also Read:ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

తెలంగాణ హై కోర్టు తెలంగాణ సర్కార్ తీసుకున్న రూట్ల ప్రయివేటీకరణపై స్పందించింది. 5100 రూట్లను ఇటీవల ప్రైవేటీకరిస్తున్నట్టు కెసిఆర్ సర్కార్ కాబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాజీ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు నిన్న హై కోర్టులో పిల్ దాఖలు చేసారు. కోర్టు నేడు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. 

ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10.30 గంటలకు హై కోర్ట్ ఈ విషయమై వాదనలు వినడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా కోర్టు తదుపరి విచారణను 11వ తేదికి వాయిదా వేసింది. అప్పటిలోగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయానికి సంబంధించిన కాబినెట్ ప్రొసీడింగ్స్ ని సమర్పించాలని ఆదేశించింది. 

అంతేకాకుండా తదుపరి విచారణ జరిగే 11వ తేదీ వరకు ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాల జోలికి వెళ్లోద్దని ఆదేశించింది. అంతే కాకుండా ఆర్టీసీని కూడా ఈలోపల కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. 

Also Read:chalo tankbund : ఆర్టీసీ కార్మిక జేఏసీ నేత రాజిరెడ్డి అరెస్ట్

నిన్న హై కోర్టులో ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు వాదనలు విన్నది.  ఆర్టీసీ విభజన అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఏపీ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. 

గురువారం నాడు ఏపీ సీఎం జగన్ ఆర్టీసీపై జరిగే సమయంలో తెలంగాణలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని కూడ ఆలోచనలో పడేసినట్టుగా సమాచారం.