ధరణి వెబ్‌సైట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ఫ్లాట్స్, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వివరాలను నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆన్‌లైన్‌లో నమోదు కానీ వాటిని పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు. ధరణి అందుబాటులోకి వచ్చేలోపు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు వందశాతం ఆన్‌లైన్‌ చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.

Also Read:కొత్త రెవిన్యూ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర: అమల్లోకి చట్టం

ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవిన్యూ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవిన్యూ బిల్లులను ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించింది. ఈ నెల 11వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో కూడ ఈ బిల్లులు ఆమోదం పొందాయి.

ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. గవర్నర్ ఈ బిల్లును ఆమోదించారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపంలోకి మారాయి. కొత్త రెవిన్యూ చట్టం ప్రకారంగా భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఎమ్మార్వోలకే ప్రభుత్వం కట్టబెట్టింది. ధరణి వెబ్ సైట్ లో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చనున్నారు.