తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్ .. విద్యార్ధులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతుండటంతో అప్రమత్తమయ్యారు.

సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి కొనసాగుతున్నాయి. అయితే కోవిడ్ కారణంగా 1 నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో సీఎం వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పరీక్షలపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
కాగా, తెలంగాణలోని గురుకుల మైనార్టీ సంక్షేమ బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా తేలింది. మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం నాగోల్‌లో వున్న మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 165 మంది వుంటున్నారు.
వారిలో 25 మంది విద్యార్ధులకు రాపిడ్ టెస్టులు చేయగా.. 18 మందికి పాజిటివ్‌గా తేలింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు మిగిలిన విద్యార్ధులు, సిబ్బందికి సైతం పరీక్షలు నిర్వహించారు.
దీనిలో మరో 18 మంది విద్యార్ధులకు కరోనా వున్నట్లు తేలింది. వీరందరినీ భవనంలోని 5వ అంతస్తులోని ఐసోలేషన్‌కు తరలించారు. నెగిటివ్ వచ్చిన విద్యార్ధులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు.