గజ్వేల్: జనవరి నెలలో గజ్వేల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకువస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సంక్రాంతి పర్వదినాన గజ్వేల్ లో గోదావరి జలాలతో పండుగ చేసుకుందామని తెలిపారు. 

కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో పర్యటించిన ఆయన మోడల్ మార్కెట్, ప్రభుత్వాస్పత్రి, ఆడిటోరియం, సమీకృత అధికార కార్యాలయం, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను  ప్రారంభించారు. 

గజ్వేల్ రాష్ట్ర ఆరోగ్య సూచిక రూపొందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అది తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గం నుంచే హెల్త్ ప్రొఫైల్ రూపొందిచనున్నట్లు తెలిపారు. ఆ దిశగా అడుగులు వేయాలని మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు కేసీఆర్. 

కంటి వెలుగు కార్యక్రమం ఎలా అయితే నిర్వహించామో అలాగే హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని సూచించారు. హెల్త్ ప్రొఫైల్ వల్ల అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. ప్రమాదాల్లో మరణాలు సంభవించకుండా చర్యలుు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 

మల్లన్నసాగర్ ప్రాజెక్టును అత్యంత సుందరమైన పార్క్ గా తీర్చిదిద్దాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. అటవీ ప్రాంత సరిహద్దు వరకు అద్భుతమైన టూరిజం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఔషధ మెక్కలు, వనమూలికలను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న 7వేల 500 ఎకరాల అటవీ ప్రాంతంలో వనమూలికల పార్క్ గా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ భూమి అన్యాక్రాంతం గురికాలేదని ఇప్పుడే పనులు ప్రారంభించాలని సూచించారు.

తెలంగాణలో వికారాబాద్ అనంతగిరి కొండలకు ఎంత అద్భుతంగా ఉందో అలాంటి అద్భుతాన్ని మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నెలకొల్పాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు, చేసిన పనులు మెుత్తం అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. 

జనవరి నెలాఖరుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి గజ్వేల్ వరకు నీళ్లు తీసుకువస్తామన్నారు. కాల్వలు తవ్వి పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని తెలిపారు. మిడ్ మానేరు ప్రాంతం వరకు నీరందుతుందని చెప్పుకొచ్చారు. జనవరిలో కాళేశ్వరం నీరును చూసి ప్రతీ ఒక్కరూ సంతోషపడాలన్నదే తన తక్షణ కర్తవ్యమని చెప్పుకొచ్చారు కేసీఆర్. 

అలాగే ప్రాజెక్టులలో చేపల పెంపకంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో హైదరాబాద్ నుంచి చేపలు కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం కాకుండా వచ్చే ఏడాది నుంచి గజ్వేల్ నియోజకవర్గం నుంచి చేపలు రావాలని ఆదేశించారు. స్వయం సంవృద్ధిత గజ్వేల్ గా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమన్నారు. 

గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలని, ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలతో కళకళలాడాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. 

ఏ గ్రామంలో ఏముంది.. ఏం కావాలి అనే విషయంపై ప్రతీ ఒక్కరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరికి కథానాయకుడు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడూ రిలాక్స్‌ కావొద్దు. 

ఇతరులు గజ్వేల్‌ను చూసి నేర్చుకోవాలన్నదే తన అభిమతమన్నారు. ఏ గ్రామంలో ఏ పని లేకుండా ఉన్నవాళ్లెవరు.. వాళ్లకేం పనివ్వాలో ఆలోచించాలి అని వారికి ఉపాధి చూపించే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 

సీఎంపై మంత్రి హరీష్ పొగడ్తలు, తప్పు అన్న కేసీఆర్:ఇంతకీ ఏం జరిగిందంటే...