ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోల్‌కతా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమైన అనంతరం ఆయన అర్థరాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో కేసీఆర్‌కు తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ జి. అశోక్ కుమార్, అడిషనల్ రెసిడెంట్ కమీషనర్ వేదాంతం గిరి ఘనస్వాగతం పలికారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఇవాళ ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మయావతి సహా పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడాలి: కేసీఆర్

బెంగాల్ సీఎం‌ మమతతో కేసీఆర్ భేటీ

పూరి జగన్నాథునికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: కేసీఆర్