ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుండి అలవాటే: మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుండి ఉన్న అలవాటేనని  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయని కుట్రలు లేవని ఆయన గుర్తు చేశారు. 

Telangana minister Jagadish Reddy reacts on Rayalaseema lift irrigations lns

హైదరాబాద్:తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుండి ఉన్న అలవాటేనని  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయని కుట్రలు లేవని ఆయన గుర్తు చేశారు. గురువారం నాడు ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై గ్రీన్ టిబ్యునల్ ను ఆశ్రయిస్తే స్టే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తమ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వానికి చెప్పినట్టుగా జగదీష్ రెడ్డి ప్రస్తావించారు.  తమ సూచనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

also read:అక్రమంగా ప్రాజెక్టులు కడితే పాతరేస్తాం: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలనం

జలయజ్ఘం పేరుతో తెలంగాణ జలాలను ఏపీ దోపీడీ చేసిందని ఆయన ఆరోపించారు.   దీనికి ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలే వంత పాడారని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు, వైఎస్ఆర్ లు  నష్టం చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్రా పాలకులకు ముందు నుండి ఉన్న అలవాటేనని ఆయన చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయని కుట్రలు లేవని ఆయన గుర్తు చేశారు. 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ  తెలంగాణకు చెందిన నేతలంతా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడకుండా ఏపీకి ప్రయోజనం కలిగేలా  వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

ఆనాడు వైఎస్ఆర్ మన్ననల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆయన చెప్పారు. జల దోపీడిని అడ్డుకొన్నామని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.  వైఎస్ఆర్ మన్ననల కోసం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు ద్రోహం చేశారన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios