ఉమ్మడి  ఖమ్మం  జిల్లా  చీమలపాడులో  జరిగిన  ప్రమాదంపై  కేసీఆర్ ఆరా తీశారు.  మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్,  ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో  ఆయన  మాట్లాడారు. 

హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ ఘటన జరిగిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. 

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల సిఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైనవైద్యసేవలందించాలని ఆదేశించారు