ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. తీవ్ర తాగునీటి ఇబ్బందులతో అల్లాడుతున్న తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందిగా ఆ రాష్ట్రానికి చెందిన మంత్రుల బృందం గురువారం ప్రగతి భవన్‌లో సీఎంను కలిసింది.

ఈ సందర్భంగా తమిళనాడు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను మంత్రుల బృందం చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన కేసీఆర్ తమిళనాడుకు తాగునీటిని ఇచ్చేందుకు అంగీకరించారు.

Also Read:జగన్‌కు హిమాన్ష్ కరచాలనం, కేసీఆర్ కాళ్లుమొక్కిన విజయసాయి

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ చర్చించాలని ఆయన వారికి సూచిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లుగా తెలుస్తోంది. అధికారులు, నిపుణులతో సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ తమిళనాడు మంత్రులకు సూచించారు.

అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వారికి చెప్పారు. తాగునీటి సమస్యల సమస్యల కోసం రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావారణం ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Also Read:ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో జగన్ భేటీ: రెండు రాష్ట్రాల అంశాలపై చర్చ

ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలని, ముఖ్యంగా తాగునీటి కోసం ప్రత్యేక వ్యూహం ఉండాలన్నారు. తమిళనాడు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తాను నీతి అయోగ్ సమావేశాల్లో పలుమార్లు లేవనెత్తానని కేసీఆర్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్లమెంట్‌లో మాట్లాడరన్నారు.

కేసీఆర్‌ను కలిసిన వారిలో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలు మణి, డీ. జయకుమార్, పబ్లిక్ వర్క్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె. మణివాసన్, సలహాదారు ఎం. షీలా ప్రియ తదితరులు ఉన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.