తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లు సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశం ఉంది.


మూడు మాసాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సోమవారం నాడు సమావేశమయ్యారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలతో పాటు  ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చిస్తారు.పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై కూడ చర్చించనున్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ప్రగతి భవన్ కు చేరుకోగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఆహ్వానించారు. కేసీఆర్‌తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ భోజనం చేశారు.భోజనం తర్వాత రెండు రాష్ట్రాల సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఇద్దరు సీఎంలు  ఇప్పటికే మూడు దఫాలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు.

Also read:జనవరి 13న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం

ఈ చర్చలకు కొనసాగింపుగానే ఇవాళ మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. గత ఏడాది నవంబర్ 23వ తేదీన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీటింగ్ ఇదే.

ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ రెండు నదులను అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని వినియోగించుకోవాలని భావించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకొంటారు.