మేడారం: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొన్నారు.   కేసీఆర్ వన దేవతలకు పట్టువస్త్రాలను సమర్పించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో  మేడారం చేరుకొన్నారు. మేడారంలో సీఎం కేసీఆర్‌కు మంత్రులు  ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ తదితరులు  సీఎం కేసీఆర్‌కు  ఘనంగా స్వాగతం పలికారు.  

Also read:మేడారం జాతర: ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్లు తమిళిసై, బండారు

వన దేవతలకు  కేసీఆర్ మొక్కులు చెల్లించారు.  శుక్రవారం నాడు ఉదయం తెలంగాణ గవర్నర్ కేసీఆర్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలు  కూడ దర్శించుకొన్నారు.సీఎం మేడారం రాకను పురస్కరించుకొని  పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

సమ్మక్క , సారలమ్మలకు కేసీఆర్ నిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించారు.మేడారం జాతరలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు,  ఇంకా ఏ రకమైన సౌకర్యాలు అందించాలనే విషయమై  సీఎం కేసీఆర్  స్థానికులతో మాట్లాడారు.వన దేవతలను దర్శించుకొన్న తర్వాత సీఎం కేసీఆర్ హైద్రాబాద్‌కు బయలుదేరారు.