వరంగల్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలు శుక్రవారం నాడు మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకొన్నారు మొక్కులు చెల్లించుకొన్నారు.

 ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకొన్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై కుటుంబసభ్యులతో కలిసి మేడారం జాతరకు  వచ్చారు.

Also read: మేడారం జాతర ప్రారంభం: గద్దెపైకి చేరిన సారలమ్మ

మేడారంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు గవర్నర్ తమిళిసైకు ఘనంగా స్వాగతం పలికారు.  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడ గిరిజన దేవతను దర్శించుకొన్నారు.

అమ్మవార్లకు గవర్నర్లు మొక్కులు చెల్లించారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి మేడారం చేరుకోనున్నారు. సమ్మక్కను గురువారం నాడు రాత్రి ఏడు గంటలకు గద్దెపై ప్రతిష్టించారు.

సారలమ్మను బుధవారం నాడు అర్ధరాత్రి గద్దెపై ప్రతిష్టించారు. శనివారం నాడు సమ్మక్క, సారలమ్మలను వనంలోకి ప్రవేశపెట్టనున్నారు. గిరిజన దేవతలను వనంలోకి ప్రవేశించడంతో ఈ జాతర ముగుస్తోంది.