Asianet News TeluguAsianet News Telugu

విభజన సమస్యల పరిష్కారం దిశగా కేసీఆర్: గవర్నర్‌తో భేటీ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. 

telangana cm kcr meets governor narasimhan
Author
Hyderabad, First Published Jun 2, 2019, 5:07 PM IST

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. తాజా రాజకీయాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించినట్లుగా సమాచారం.

ప్రధానంగా ఏపీ సచివాలయ భవనాలు, ఇతర హెచ్‌ఓడీ భవనాల అప్పగింతపై వీరిద్దరూ చర్చించారు. దీంతో పాటు గతంలో చేసిన కేబినెట్ తీర్మానం, ఏపీకి ఇచ్చే భవనాల ప్రతిపాదనలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించని భవనాలను వెనక్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా ఏపీ సీఎం జగన్, కేసీఆర్‌ల మధ్య విభజన సమస్యల అంశం చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios