Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ కార్మికులతో ప్రారంభమైన కేసీఆర్ ఆత్మీయ సమావేశం

టీఎస్ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి ఐదుగురు ఆర్టీసీ కార్మికులు ప్రగతి భవన్‌కు వచ్చారు. 

Telangana CM KCR Meeting With TSRTC Workers
Author
Hyderabad, First Published Dec 1, 2019, 3:33 PM IST

టీఎస్ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి ఐదుగురు ఆర్టీసీ కార్మికులు ప్రగతి భవన్‌కు వచ్చారు. వీరందరితో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆర్టీసీ అభివృద్ధి, సమస్యలు, ప్రస్తుత స్ధితిపై ముఖ్యమంత్రి కార్మికులతో ముఖాముఖి ప్రారంభించారు.

Also Read:అన్న మాట ప్రకారం: ఆర్టీసీ కార్మికులతో ఆదివారం కేసీఆర్ భేటీ

డిసెంబర్ 1 ఆదివారం ప్రగతి భవన్‌లో సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను సమావేశానికి ఆహ్వానించాలని... వీరిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వీరు ప్రగతిభవన్ చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సందిగా కేసీఆర్ ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. అలాగే ఈ సమావేశానికి వచ్చే కార్మికులలో అన్ని వర్గాలకు చెందిన వారి భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు.

డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల కల్లా కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని.....వీరికి అక్కడే భోజన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Also Read:ఆ ఫోన్ కాల్ లేకపోయుంటే: ప్రియాంక నిందితుల గుట్టు విప్పింది అదే

అనంతరం కేసీఆర్ కార్మికులతో ముఖాముఖి నిర్వహించి... ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు హాజరవుతారు.

అంతకుముందు ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవడానికి అనుమతించిన ముఖ్యమంత్రికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చిన అజయ్ కుమార్... ఆర్టీసీ మనుగడను కాపాడటానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా గురువారం ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని తాము నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ శుక్రవారం ఉదయం యధావిథిగా విధులకు హాజరు కావొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమే తమకు రూ.22 వేల కోట్లు ఇవ్వాలని, కానీ కేంద్రం వాటా గురించి చెప్పేవాళ్లు ఈ డబ్బు ఇప్పిస్తారా అని సీఎం ప్రశ్నించారు.

Also Read:మా ఇంటికి రావొద్దు: ప్రియాంక పేరెంట్స్, ఇంటికి తాళం వేసుకుని...

ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి నష్టాలను పూడ్చేందుకు ఆసరా కల్పిస్తామని... కి.మీ.20 పైసలు చొప్పున పెంచుతామని సోమవారం నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు.

కార్మికులు విధుల్లో చేరడానికి ఎలాంటి షరతులు లేవని... త్వరలో కార్మికులతో తానే స్వయంగా మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు. మేమన్న ప్రైవేటీకరణ వేరని... బయట ప్రచారం చేసింది వేరని, ప్రైవేట్ పర్మిట్లు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇద్దామనుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios