హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై  ఎమ్మెల్యేలతో  సీఎం కేసీఆర్ గురువారం నాడు తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు.  ఒక్క మున్సిపల్ స్థానాన్ని కోల్పోయిన కూడ మంత్రి పదవి పోతోందని సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రులను హెచ్చరించిన విషయం తెలిసిందే.

Also read:మున్సిపల్ పోల్స్: 'చేయి' చాచిన రాని సైకిల్, లెఫ్ట్

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్ జారీ చేసింది.ఈ  ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో  రెబెల్స్  బెడద ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఏం చేయాలనే దానిపై అనుసరించాల్సిన వ్యూహంపై  కేసీఆర్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు.

మరో వైపు బీఫారాల జారీ విషయంలో కూడ ఎలా వ్యహరించాలనే దానిపై కూడ కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలను టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. దీంతో మెజారిటీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరు బాగా లేనందున  మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యతను వహించే పేరుతో మంత్రులను కేసీఆర్ తప్పించాలనే యోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కేసీఆర్ మంత్రులకు తేల్చి చెప్పారు.