గాంధీ ఆసుపత్రి: 16 అడుగుల గాంధీ విగ్రహన్ని ఆవిష్కరించిన కేసీఆర్
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహత్మాగాంధీ విగ్రహన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. 16 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మహాత్మగాంధీ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. 16 అడుగల ఎత్తులో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో గాంధీఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించారు. ఇతర వైద్య చికిత్సలు నిలిపివేసి కరోనాకు మాత్రమే ఈ ఆసుపత్రిలో సేవలు అందించిన విషయం తెలిసిందే. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ ఈ విగ్రహన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ నగంలోని పలుప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
క్లాక్ టవర్ సెంటర్ నుండి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తా వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆలుగడ్డబావి నుండి ముషీరాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి సికింద్రాబాద్ వైపు వాహనాలను నిలిపివేశారు.అంతకుముందు సికింద్రాబాద్ లోని మహత్మాగాంధీరోడ్డులో గాంధీ విగ్రహన్ని సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో మున్సిఫల్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.