Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ కొత్త సచివాలయం.. అధికారులకు కేసీఆర్ కీలక సూచనలు

గడువులోగా తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి కేసీఆర్ సచివాలయాన్ని సందర్శించారు. 
 

telangana cm kcr key directions to officials over new secretariat building constitution
Author
First Published Jan 24, 2023, 9:10 PM IST

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన సచివాలయంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా.. ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు హాజరవుతారు. 

ఇకపోతే.. తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు   2019  జూన్  27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. సుమారు  ఏడు లక్షల చదరపు అడుగుల  స్థలంలో  కొత్త సచివాలయాన్ని  నిర్మించారు. భూమి పూజ చేసిన సమయంలో  ఈ నిర్మాణ పనులను  9 మాసాల్లో పూర్తి చేయాలని తొలుత భావించారు. అయితే కరోనా కారణంగా  సచివాలయ నిర్మాణ పనులు  ఆలస్యమయ్యాయి. గతేడాది  దసరా నాటికే  సచివాలయాన్ని  ప్రారంభించాలని భావించారు. కానీ  అప్పటికీ  కూడ పనులు పూర్తి కాలేదు. దీంతో  కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

ALso REad: ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ ప్రారభోత్సవం: హజరు కానున్న తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు

కొత్త సచివాలయం  పార్కింగ్  స్థలంలో  300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్  చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో  ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో  కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు  ఉంటాయి. ఏడో అంతస్థులో  సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది. కొత్త సచివాలయం  పార్కింగ్  స్థలంలో  300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్  చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో  ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో  కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు  ఉంటాయి.  ఏడో అంతస్థులో  సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios