Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా  పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Telangana CM KCR greets PM Modi on his birthday Ksm
Author
First Published Sep 17, 2023, 4:14 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నేడు 73వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా  పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. వ్యక్తిగతంగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా కేసీఆర్ పేర్కొన్నారు. ఇంకా చాలా ఏళ్లు దేశానికి సేవ చేసేందుకు మోదీకి దేవుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నట్టుగా లేఖలో కేసీఆర్ తెలిపారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన  శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోదీకి జన్మదిన  శుభాకాంక్షలు తెలిపారు. స్ఫూర్తివంతమైన నాయకుడు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios