సికింద్రాబాద్  కంటోన్మెంట్  ఎమ్మెల్యే  సాయన్న  మరణం పట్ల  తెలంగాణ సీఎం  కేసీఆర్  సంతాపం తెలిపారు.  సాయన్నతో  తనకు  ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు  చేసుకున్నారు.   

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాదపడుతున్న సాయన్న ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

ఐదు సార్లు ఎమ్మెల్యే గా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సాయన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు కేసీఆర్ సానుభూతిని తెలిపారు.

Scroll to load tweet…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం సాయన్న నిరంతరం తపించేవారని తెలంగాణ మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో సాయన్న మృతి చెందడంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. 1994 అసెంబ్లీ ఎన్నికల ముందు కార్పోరేట్ గా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. కంటోన్మెంట్ ప్రజల అభిమానంతో సాయన్న ఐదు సార్లు విజయం సాధించారన్నారు.