Asianet News TeluguAsianet News Telugu

దసరాలోపుగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్:తేల్చేసిన కుమారస్వామి

జాతీయ రాజకీయాల్లోకి దసరాలోపుగానే కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఇవాళ కేసీఆర్ తో మూడు గంటలకు పైగా కేసీఆర్ తో కుమారస్వామి చర్చించారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తో  కుమారస్వామి మాట్లాడారు. 

Telangana CM KCR Entering National Politics Before vijayadashami Festival:Kumaraswamy
Author
First Published Sep 11, 2022, 8:51 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దసరాలోపుగా జాతీయ రాజకీయాల్లోకి రానున్నారని  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. కేసీఆర్ తో భేటీ గురించి ట్విట్టర్ వేదికగా కుమారస్వామి ప్రకటించారు. 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారన్నారు. దసరాలోపుగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.  జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందే జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దసరా లోపుగానే జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.  

 

జాతీయ పార్టీలకు ధీటుగా సమాంతర ఫ్రంట్ ను నిర్మించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారని కుమారస్వామి చెప్పారు. రైతులు, కూలీలు, సామాన్యులతో కూడిన కొత్త ఫ్రంట్ కి తాను కూడా మద్దతు ప్రకటించినట్టుగా కుమారస్వామి స్పష్టం చేశారు. కర్ణాటకతో పాటు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తో చర్చించినట్టుగా కుమారస్వామి వివరించారు. 

also read:త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీ: మద్దతిచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(ఫోటోలు)

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలు, సీఎంలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు. కేసీఆర్ తో జాతీయ రాజకీయాలపై చర్చించారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని కేసీఆర్ చెప్పారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని తనకుప్రజల నుండి ఒత్తిడివస్తుందని కేసీఆర్ కుమారస్వామికి చెప్పార,ు. ఈ దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పార్టీ ఏర్పాటు చేయనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఏర్పాటు చేయనున్న పార్టీకి తన మద్దతును ప్రకటించారు కుమారస్వామి.

Follow Us:
Download App:
  • android
  • ios