రాష్ట్రపతి ఎన్నికలపై మమత బెనర్జీ మీటింగ్: డుమ్మా కొట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం
రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొని విపక్షాల తరపున అభ్యర్ధిని బరిలోకి దింపే విషయమై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీతో వేదికను పంచుకోవడంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: West Bengal సీఎం Mamata Banerjee ఏర్పాటు చేసిన సమావేశానికి TRS దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి తొలుత పార్టీ ప్రతినిధులను పంపాలని భావించినప్పటికీ తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ నాయకత్వం ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశానికి Congress పార్టీ ఆహ్వానించవద్దని కోరినా ఫలితం లేకపోవడంతో టీఆర్ఎస్ ఈ సమావేశానికి దూరంగా ఉండాలలని నిర్ణయం తీసుకుంది. Presidenttial Electionsను పురస్కరించుకొని విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపే విషయమై BJPయేతర పార్టీలతో ఇవాళ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి టీఆర్ఎస్ కూడా ఆహ్వానం పంపారు.ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అనే విషయమై పార్టీ నేతలతో KCR చర్చించారు. చివరకు ఈ సమావేశానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. Telanganaలో టీఆర్ఎస్ కు Congress పార్టీ ప్రధాన ప్రత్యర్ధి. కాంగ్రెస్ పార్టీతో కలిసి వేదికను పంచుకొంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది.
దీంతో మమత నిర్వహించే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ సీఎం మమత బెనర్జీ తనకు ఫోన్ చేసి సమావేశం వివరాలను కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించారు.
తొలుత ఈ సమావేశానికి తెలంగాణ ప్లానింగ్ బొర్డు వైస్ చైర్మెన్ బి. వినోద్ కుమార్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, కేశవరావులను ఈ సమావేశానికి పంపాలని భావించారరు. కానీ కాంగ్రెస్ పార్టీతో సమావేశం పంచుకోవడంతో తప్పుడు సంకేతాలు వస్తాయని పార్టీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం తమ వంతు పాత్ర ఉండాలని గులాబీ బాస్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు పలు ప్రాంతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలతో కేసీఆర్ సమావేశమౌతున్నారు. మరో వైపు జాతీయ పార్టీ ఏర్పాటు కోసం కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది.
also read:కేసీఆర్ హానీట్రాప్‌లో ఉండవల్లి అరుణ్ కుమార్:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిల్లో ఉన్న పరిస్థితులను కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకోవడం పార్టీ నష్టమనే అభిప్రాయంతో గులాబీ బాస్ ఉన్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ విషయమై ఈ నెల చివర్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏ రకమైన పోషించనుంది. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా పార్టీ నేతలకు కేసీఆర్ వివరించనున్నారు.