కేసీఆర్ హానీట్రాప్‌లో ఉండవల్లి అరుణ్ కుమార్:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ హానీట్రాప్ లో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు., సమైఖ్యాంధ్ర కోసం ఉండవల్లి పోరాటం చేశారనే గౌరవం ఉందన్నారు. కేసీఆర్ పంచన చేరి ఉండవల్లి అరుణ్ కుమార్ తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR హానీట్రాప్ లో రాజమండ్రి మాజీ ఎంపీ Vundavalli Arunkumar పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఈడీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో Revanth Reddy ఈ వ్యాఖ్యలు చేశారు. . కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ పంచన చేరి భజన చేస్తున్నారని విమర్శించారు.సమైక్యాంధ్ర సిద్దాంతం కోసం పోరాడారనే గౌరవం ఉండేదన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ పై Telangana ప్రజల్లో ఉన్న గౌరవం పోయిందన్నారు. BJP పై పోరాడితే కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారన్నారు.
రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. రెండు పుస్తకాల్లో తెలంగాణ ఏర్పాటునే తప్పుబట్టారని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.. తెలంగాణ కోసం పోరాడిన మాజీ కేంద్ర మంత్రి Jaipal Reddy, పొన్నం ప్రభాకర్‌ను ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారన్నారు. అలాంటి వ్యక్తి ని కేసీఆర్ ఇంటికి పిలిచి కలిసి పనిచేయమంటరా?. ఉండవల్లి అడ్డామీద కూలిగా మారి కేసీఆర్‌తో కలవదన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు.
రెండు రోజుల క్రితం కేసీఆర్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ విషయాలపై ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వంటి మనిషి ఫోన్ చేసి సామాన్యుడినైన తనను పిలిచారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపాలని కేసీఆర్ ఉన్నారన్నారు.
ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది.. ఎంత పవర్ జనరేషన్ ఉంది.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయాలపై కేసీఆర్ హోంవర్కు చేసినట్టుగా చెప్పారు. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతుంటానని, ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదని కూడా తాను చెప్పానన్నారు.. టీవీల్లో మరింత ఎక్కువగా మాట్లాడాలని కేసీఆర్ సూచించారన్నారు. బీజేపీ ఓట్లు పెరగకూడదని అది పెరిగితే చాలా ప్రమాదమని కేసీఆర్ చెప్పారన్నారు.
తమతోపాటు ప్రశాంత్‌కిశోర్ కూడా ఉన్నారని ఉండవల్లి చెప్పారు. మరో ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ ఉన్నారు. హరీశ్ రావు నన్ను రిసీవ్ చేసుకుని అరగంట మాట్లాడిన తర్వాత కేసీఆర్ వచ్చారన్నారు. మోదీలా అందరినీ ఆకట్టుగోగల శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు..
కేసీఆర్ మంచి వక్త. ఆంగ్లం, తెలుగు, హిందీలో కూడా మాట్లాడగలరన్నారు. మమతా బెనర్జీ అంతగా మాట్లాడలేరని ఆయన చెప్పారు. మోదీలా అందరినీ ఆకట్టుగోగల శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు. కచ్చితంగా బీజేపీ వ్యతిరేక వైఖరితో అందరినీ లీడ్ చేయగల శక్తి ఉందన్నారు. బీజేపీ కాన్సెప్ట్ వల్ల దేశానికి నష్టం. వాజ్‌పేయి ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదన్నారు. ఇవాళ సోనియాగాంధీ, రాహుల్‌కు కూడా సమన్లు ఇచ్చారన్నారు.. మాట్లాడే పరిస్థితిలో ఎవరూలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబడినప్పుడు అది నచ్చినవారంతా ఆయనకు సపోర్టు చేయాలన్నారు. కాంగ్రెస్ బలం తగ్గింది. ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకోవాలన్నారు.