హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను తాను ఆహ్వానిస్తే  జగన్ రావొద్దంటూ కొందరు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇరు రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో వైయస్ జగన్ ను ఆహ్వానిస్తే అవగాహన లేని కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారమిస్తే ఎక్కడా ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు సరికదా తెలంగాణ దాహార్తిని తీర్చి, సస్యశ్యామలం చేసే కాళేశ్వరాన్ని అడ్డుకోవాలనుకోవడం బాధాకరమన్నారు. 
 
బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరానికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. కాళేశ్వరం మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. జులై నాటికి మిషన్‌ భగీరథ పూర్తవుతుందన్నారు కేసీఆర్. 

పాలమూరు ఎత్తిపోతలకు రూ.10వేల కోట్లు బ్యాంకులు ఇచ్చాయని కాళేశ్వరం ప్రారంభోత్సవం పూర్తి అయిన వెంటనే పోలమూరు ఎత్తిపోతల పథకం పరుగెత్తిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్డీఏలో భాగస్వామికాదు, ఫెడరల్ ఫ్రంట్ కు కట్టుబడే ఉన్నా: తెలంగాణ సీఎం కేసీఆర్

ఈనెల 27న తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ లకు శంకుస్థాపన: తెలంగాణ సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్, నేను కలిసి పని చేస్తాం: తెలంగాణ సీఎం కేసీఆర్