హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాదని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సార్వత్రిక ఎన్నికల్లో తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నించానని దానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 

నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ఆయనను వ్యతిరేకించిన వ్యక్తిని తానేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మోదీని ఫాసిస్ట్ ప్రధాని అంటూ విమర్శించింది తానేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు కేంద్రం సాయం చేసిందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించానని గుర్తు చేశారు. 

అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విషయం గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ భాగస్వామి కాదన్నారు. అయితే ఎన్డీఏకు అంశాల వారీగా మద్దతు ఇస్తామన్నారు. నచ్చని అంశాలతో విబేధిస్తామని తేల్చి చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే రూ.24 కూడా ఇవ్వలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత పోలమూరు ప్రాజెక్టు పనుల్లో వేగవంతం చేస్తామన్నారు సీఎం కేసీఆర్. 

ఈ వార్తలు కూడా చదవండి

ఈనెల 27న తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ లకు శంకుస్థాపన: తెలంగాణ సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్, నేను కలిసి పని చేస్తాం: తెలంగాణ సీఎం కేసీఆర్