Asianet News TeluguAsianet News Telugu

ఈనెల 27న తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ లకు శంకుస్థాపన: తెలంగాణ సీఎం కేసీఆర్

ఈనెల 27న తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎర్రమంజిల్ లో 17ఎకరాలలో అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. రూ.100 కోట్ల రూపాయలతో పాత అసెంబ్లీ భవనాన్ని తలపించేలా నిర్మాణాలు జరుగుతాయన్నారు. 

telangana cm kcr comments over cabinet meeting
Author
Hyderabad, First Published Jun 18, 2019, 8:55 PM IST

హైదరాబాద్: ఈనెల 27న తెలంగాణ అసెంబ్లీ, సెక్రటేరియట్ నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎర్రమంజిల్ లో 17ఎకరాలలో అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. రూ.100 కోట్ల రూపాయలతో పాత అసెంబ్లీ భవనాన్ని తలపించేలా నిర్మాణాలు జరుగుతాయన్నారు. 

అయితే పాత అసెంబ్లీని ఎట్టి పరిస్థితుల్లో కూల్చబోమని మెరిటేజ్ కట్టడంగా అందుబాటులోకి ఉంచుతామన్నారు. మరోవైపు రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. ఈ అంశంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రితోపాటు పలువురు అధికారులతో సబ్ కమిటీ నియమించినట్లు తెలిపారు. 

సబ్ కమిటీ నివేదిక అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయం సీఎంకే వదిలేస్తూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్ పై మరోసారి భేటీ అయి నిర్ణయం ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. 

పీఆర్సీతోపాటు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంచే అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాలతో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి పీఆర్సీతోపాటు రిటైర్మెంట్ వయసు అన్నీ అంశాలపై నిర్ణయం తీసుకుని ఒకేసారి అమలు చేస్తామన్నారు. 

నూతన పంచాయితీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులను కీలక భాగస్వామ్యం చేస్తామన్నారు. అలాగే త్వరలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. 

142 మున్సిపాలిటీలలో జూలై నాటికి పరిమితి కాలం ముగియనుందన్నారు. పంచాయితీరాజ్ కోడ్ ముగిసిన వెంటనే నూతన మున్సిపాలిటీ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చించాలని నివేదికను త్వరలో అందజేయాలని తీర్మానించినట్లు తెలిపారు. 

తెలంగాణ సినిమా డైరెక్టర్ శంకర్ శంకర్ పల్లి మోకిల ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని ఎకర రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. శారదాపీఠం ట్రస్ట్ కోరిక మేరకు కోకాపేటలో రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అలాగే 33 జిల్లాలకు గానూ 31 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ భవనాలకు స్థలాలు కేటాయింపులు జరిగాయన్నారు. 

వరంగల్ రూరల్ జిల్లా పార్టీకార్యాలయంకు సంబంధించి స్థల కేటాయింపు పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పార్టీ స్థలం కేటాయించడం పార్టీ కార్యాలయం నిర్మానించడం కూడా జరిగిందన్నారు. అలాగే హైదరాబాద్- సికింద్రాబాద్ సిటీలలో మరో పార్టీ కార్యాలయానికి స్థలాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోపాటు మంత్రులు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్లు తెలిపారు. 

గవర్నర్ నరసింహన్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారని తెలిపారు. మేరుగడ్డ వద్ద ప్రత్యేక పూజ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తానే ప్రారంభిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద హోమం నిర్వహించి ఆ తర్వాత ప్రారంభోత్సవ ప్రక్రియలో పాల్గొంటామన్నారు కేసీఆర్. 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. బ్యాంకర్లు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ లకు మెుత్తం నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తామన్నారు. అయితే ఏపీ సీఎం వైయస్ జగన్ వారి హెలికాప్టర్లో వస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ సీఎం జగన్, నేను కలిసి పని చేస్తాం: తెలంగాణ సీఎం కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios