Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయం దండగ కాదు.. పండగయ్యింది, సాగు వైపుకు యువత పయనం : కేసీఆర్

దండుగ అన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండటం వెనుక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఉందన్నారు ముఖ్యమంత్రి

telangana cm kcr comments on jobs ksp
Author
Hyderabad, First Published Jul 15, 2021, 4:18 PM IST

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా లక్షా 30 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. నూతన జోన్ల ఆమోదం తర్వాత మరో 50 వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ రూపొందించినట్లు సీఎం తెలిపారు. భవిష్యత్‌లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరపునున్నట్లు చెప్పారు కేసీఆర్. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందని సీఎం వెల్లడించారు. దండుగ అన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ అన్నారు.

Also Read:ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ‌కి ఆమోదం, ఆయిల్ పామ్‌కు ప్రోత్సాహాకాలు: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండటం వెనుక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఉందన్నారు ముఖ్యమంత్రి. పారిశ్రామిక , వాణిజ్య, ఐటీ సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధిలో ముందున్నాయని కేసీఆర్ తెలిపారు. లక్షలాదిగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్న కేసీఆర్.. ప్రస్తుత కాల, మాన పరిస్ధితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. ఐటీ సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్ఞాన అకాడమీని దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios