హైదరాబాద్: ఈటల రాజేందర్ తప్పు చేశారు. దానిని ఆయన స్వయంగా ఒప్పుకొన్నారు. అందుకే కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. మంగళవారం నాడు కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు ఈటల రాజేందర్ విషయాన్ని సీఎం కేసీఆర్ వివరించారు.  కేబిసెట్ సమావేశం చివర్లో అధికారులంతా  కేబినెట్ సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత  ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చించారు. 

also read:డీఎస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ: మతలబు ఏమిటీ?

ఈ విషయమై చర్యలు తీసుకోకపోతే  ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని  సీఎం కేసీఆర్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.  ఈటల ఎపిసోడ్‌పై క్లుప్తంగా తాను చెప్పాలనుకొన్న అంశాలను సీఎం కేసీఆర్  మంత్రులకు చెప్పారు. అంతా చట్ట ప్రకారంగానే సాగుతోందన్నారు. ఈటల రాజేందర్ విషయంలో ఎవరూ కూడ నోరు విప్పవద్దని సీఎం మంత్రులకు తేల్చి చెప్పారు. ఎవరి పనిని వారు చేసుకోవాలని  ఆయన సూచించారు. 

మాసాయిపేట, హకీంపేటల్లో అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు. మరోవైపు దేవరయంజాల్  గ్రామంలో  శ్రీసీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను  ఈటలతో పాటు ఆయన అనుచరులు కూడ ఆక్రమించుకొన్నారనే ఆరోపణలపై  ఐఎఎస్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు.