హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్  బుధవారం నాడు  మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. గంటన్నరపాటు డి.శ్రీనివాస్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటల చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల వెల్లడించారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.

also read:రాజకీయాలే మాట్లాడా... ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించలేదు: భట్టి విక్రమార్క

మంగళవారం నాడు ఈటల రాజేందర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన విషయం తెలిసిందే.   కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, అదే పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు  సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో  సీఎం కేసీఆర్ ను కలిసేందుకు డీఎస్ ప్రయత్నాలు చేసినా ఆయనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ దక్కలేదు.  తనపై చర్యలు తీసుకోవాలని  డిఎస్ టీఆర్ఎస్ నాయకత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.