సారాంశం

బీఆర్ఎస్ తొలి జాబితాలో అవకాశం లభించని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సీఎం కేసీఆర్ నామినేటెడ్ పోస్ట్ కల్పించారు. ఆయనను వ్యవసాయరంగంపై సలహాదారుగా నియమించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటన బిఆర్ఎస్ లో కలకలం రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కొందరు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి సిద్దమవుతున్నారు. ఇలా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన, కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. 

ALso Read: బిజెపి వైపు చెన్నమనేని రమేష్ చూపు... ఇప్పటికే ఈటలతో చర్చలు?

కాగా.. వేములవాడ నుంచి పోటీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నమనేని రమేష్‌కు ఈసారి టికెట్ నిరాకరించారు కేసీఆర్. ఆయనకు బదులుగా చల్మెడ నరసింహారావుకు అవకాశం కల్పించారు. దీంతో చెన్నమనేని అలకబూనారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్‌ను వీడుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా చెన్నమనేని రమేష్‌కు నామినేటెడ్ పదవి కల్పించారు సీఎం కేసీఆర్. ఆయనను వ్యవసాయరంగ సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పాటు కేబినెట్‌ ర్యాంక్‌తో ఈ పదవిలో కొనసాగనున్నారు రమేష్.