Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ తీర్మానం కాకెత్తుకుపోయింది: అసెంబ్లీలో బీజేపీపై కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో  కాంగ్రెస్,  బీజేపీలపై  తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు

Telangana CM CM KCR Satirical Comments  On BJP lns
Author
First Published Aug 6, 2023, 4:18 PM IST

హైదరాబాద్: ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బీజేపీ  కాకినాడ తీర్మానాన్ని అమలు చేయలేదని  తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై  స్వల్పకాలిక చర్చపై   ఆదివారంనాడు  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడ సమావేశంలో  బీజేపీ తీర్మాణం చేసిన  విషయాన్ని కేసీఆర్ గుర్తు  చేశారు. అయితే   ఈ తీర్మాణాన్ని బీజేపీ  అమలు చేయలేదన్నారు.అప్పటి   హోం శాఖ మంత్రిగా  ఉన్న అద్వానీ  హైద్రాబాద్ పర్యటన సమయంలో చేసిన వ్యాఖ్యలను  కేసీఆర్ గుర్తు  చేశారు. తెలంగాణ హైద్రాబాద్ లో ఉండగా ప్రత్యేక  తెలంగాణ ఎందుకని  అద్వానీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.

వాజ్ పేయ్ ప్రధానిగా  ఉన్న సమయంలో మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశారని కేసీఆర్ గుర్తు  చేశారు. కానీ  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  చేయలేదన్నారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని ఓట్లు వేయించుకున్న తర్వాత  ఈ హామీని  బీజేపీ అమలు చేయలేదన్నారు.కాకినాడ తీర్మానం కాకిలెత్తుకుపోయిందని  బీజేపీపై కేసీఆర్ సెటైర్లు వేశారు. 

మోడీకి మనమీద పగ ఎందుకో అర్ధం కాదన్నారు.  ఢీల్లీ నుండి బీజేపీ అగ్రనేతలు వస్తూ పోతూ ఉంటారన్నారు.  నెల  రోజుల్లో  ప్రభుత్వాన్ని పడగొడతామని  చేసిన వ్యాఖ్యలను  ఆయన  గుర్తు చేశారు.రైల్వే స్టేషన్ లో కూడ  లిఫ్టును కూడ బీజేపీ నేతలు  జాతికి అంకితం చేస్తారన్నారు.వందే భారత్ రైలుకు వందసార్లు జెండా ఊపుతారని  ఆయన సెటైర్లు  వేశారు.దేశం  ప్రగతి పథంలోకి వెళ్లకుండా బీజేపీ నేతలు కట్ చేస్తున్నారని  ఆయన  విమర్శలు  చేశారు.

also read:ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు:అసెంబ్లీలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా  బీజేపీ తీర్మానం చేసింది.  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన  తర్వాత  బీజేపీ  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్ని  కేసీఆర్  ప్రస్తావించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios