Asianet News TeluguAsianet News Telugu

మేడిగడ్డ వద్ద నిర్మాణం వద్దని నిపుణుల సూచన: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో  నిపుణుల కమిటీ  సూచనలను కేసీఆర్ సర్కార్ తొక్కిపెట్టిందని  రేవంత్ రెడ్డి  విమర్శించారు. 

Telangana CM Anumula Revanth Reddy sensational  comments on KCR lns
Author
First Published Feb 17, 2024, 3:23 PM IST

హైదరాబాద్: తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసిందని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి  గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ తేల్చిందని  సీఎం తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖపై  శ్వేత పత్రం శనివారంనాడు అసెంబ్లీలో  విడుదల చేసింది.  ఈ శ్వేతపత్రంపై  అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భారత రాష్ట్ర సమితి తరపున  మాజీ మంత్రి హరీష్ రావు చర్చలో పాల్గొన్నారు.హరీష్ రావు  ప్రసంగిస్తున్న సమయంలో  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.

also read:న్యూఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో కూలిన నిర్మాణం: ఎనిమిది మంది కార్మికులకు గాయాలు

గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సీఎం కేసీఆర్   ఒక కమిటీ వేశారని ఆయన గుర్తు చేశారు.ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీష్ కు గౌరవం ఉండేదని సీఎం అనుముల రేవంత్ రెడ్డి  చెప్పారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

ప్రాణహిత చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు మహారాష్ట్ర సీఎంతో , ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఏపీ సీఎం చర్చించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2012 లో స్టాండింగ్, కో-ఆర్డినేషన్ కమిటీలను వేసినట్టుగా  సీఎం చెప్పారు. 

also read:కారు వాటర్ వాష్ చేస్తున్న యువతిపై బాటిల్‌తో దాడి: కౌంటరిచ్చిన బాధితురాలు వీడియో వైరల్

ఆనాడు ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యేది 1850 ఎకరాల పట్టా భూములు మాత్రమేనన్నారు.మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన కేసీఆర్ దేనని  రేవంత్ రెడ్డి  చెప్పారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదన్నారు.

ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అల్లుళ్లు ప్రాజెక్టు నిర్మించారన్నారు.ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని ఓ పత్రికలో రాసిన కథనాన్ని  రేవంత్ రెడ్డి సభలో చూపారు.

also read:ఇనుప కడ్డీల మధ్య చిక్కుకున్న హంస: కాపాడిన వ్యక్తి వీడియో వైరల్

తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ , హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలన్నారు.కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు... కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ఆయన తెలిపారు. 

క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని హరీష్ రావుపై సీఎం మండిపడ్డారు. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా? అని సీఎం ప్రశ్నించారు. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు... తొండి వాదనలు వద్దని  హరీష్ రావుకు సీఎం సూచించారు. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా? అని ప్రశ్నించారు. 

చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క ఇప్పుడు వారి పక్కనే ఉందని సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి  వ్యాఖ్యానించారు.ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఈనాడు హరీష్ రావును సమర్ధిస్తున్నారా అని  సీఎం ప్రశ్నించారు. 

also read:టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి... సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇవ్వాలని హరీష్ రావుకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

Follow Us:
Download App:
  • android
  • ios