మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు: రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తేల్చి చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు  మెట్రో రైలు మార్గం దూరం తగ్గిస్తున్నట్టుగా ఆయన వివరించారు

Telangana Chief minister Anumula Revanth Reddy key statement on  Pharma city and shamshabad airport metro lns


హైదరాబాద్: మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి  మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైమ్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు.

శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామన్నారు.బీహెచ్ఈఎల్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి 32 కి.మీ. ఉంటుందన్నారు. ఎంబీబీఎస్ నుండి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం వెళ్తుందన్నారు. అవసరమైతే  మియాపూర్ నుండి రామచంద్రాపురం వరకు మెట్రో రైలును  పొడిగిస్తామని సీఎం అనుముల రేవంత్ రెడ్డి  తేల్చి చెప్పారు. 

also read:బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?

మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి నుండి మెట్రో రైలులో విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపుగా ఉండరని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయన్నారు.గత ప్రభుత్వ అంచనాల కంటే తక్కువ ఖర్చుతోనే  మెట్రోను శంషాబాద్  విమానాశ్రయం వరకు విస్తరించనున్నట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు.నాగోల్, ఎల్ బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి మీదుగా మెట్రోను విస్తరించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి మెట్రోను లింక్ చేస్తామని సీఎం వివరించారు.

తమ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గం గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్ కంటే  తక్కువ ఖర్చుతో  ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని రేవంత్ రెడ్డి  చెప్పారు.ఫార్మా సిటీ, రీజీనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు.

also read:కొత్త టీమ్‌ కోసం కిషన్ రెడ్డి కసరత్తు: 15 జిల్లాల అధ్యక్షుల మార్పు

ప్రత్యేక క్లస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్లను నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.హైద్రాబాద్ కు కార్మికులు రాకుండా క్లస్టర్లలోనే అన్ని ఏర్పాట్లు కల్పిస్తామన్నారు.పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర అతిథి గృహంగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక వర్శిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పారిశ్రామికవేత్తలతో శిక్షణ  ఇస్తామని  రేవంత్ రెడ్డి  చెప్పారు.శిక్షణ పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్ ఎంపికలుంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

వంద పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీని ఉంటుందని ఆయన వివరించారు.విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ క్లాసులుంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు.ఆయా దేశాలకు కావాల్సిన మానవ వనరులకు ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు.ఔత్సాహికులైన యువతకు ఆసక్తి ఉన్న విభాగాల్లో శిక్షణ అందిస్తామన్నారు.శిక్షణ తరగతుల్లో సీనియర్ అధికారుల సేవలు వాడుకుంటామని రేవంత్ రెడ్డి వివరించారు.

పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటేడ్ పదవులను భర్తీ చేస్తామని  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎల్లుండి  పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.ఈ సమావేశంలో  నామినేటేడ్ పదవుల విషయంలో  చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios