ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు: కాంగ్రెస్ ఫిర్యాదు, విచారణకు ఈసీ ఆదేశం
ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందించారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై సీఈఓ వికాస్ రాజ్ విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్ధులకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందించడంపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ విచారణకు ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ ఏడాది ఆగస్టు 21న బీఆర్ఎస్ ప్రకటించింది . ఈ నెల 15న తెలంగాణ భవన్ లో అభ్యర్ధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మంచి రోజు కావడంతో అదే రోజున 51 మంది అభ్యర్ధులకు కేసీఆర్ బీ ఫారాలు అందించారు.ఈ నెల 17న మరికొందరు అభ్యర్ధులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు అందించారు. ప్రగతి భవన్ లో అభ్యర్ధులకు బీ పారాలను కేసీఆర్ అందించారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఈ నెల 17న రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కోడ్, ఇతర అంశాల గురించి చర్చించారు. అయితే ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు కేసీఆర్ బీ ఫారాలు అందించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. సీఎం అధికారిక నివాసంలో బీ ఫారాలు అందించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును బీఆర్ఎస్ తోసిపుచ్చింది. ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు బీ ఫారాలు అందించారనే ఫిర్యాదుపై విచారణకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9న విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
also read:బీ ఫారాలు అందుకున్న ఆ ఇద్దరు: 51 మందికే బీఆర్ఎస్ బీ ఫారాలు(వీడియో)
ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని పలు చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిన్నటి వరకు రూ. 130 కోట్లను పోలీసులు సీజ్ చేశారు.