Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజే తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ.. లాక్ డౌనా? నైట్ కర్ఫ్యూనా? సర్వత్రా ఉత్కంఠ...

ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించారు.  నివేదికపై చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే లాక్ డౌన్ విధించే అవకాశాలపై సైతం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

telangana cabinet meeting today as covid 19 cases surge, may take decision on lockdown
Author
Hyderabad, First Published Jan 17, 2022, 10:08 AM IST

హైదరాబాద్ : telanganaలో carona cases భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో రోజువారీ నమోదవుతున్న కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో CM KCR అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు cabinet meeting జరగనుంది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు.. వాటి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలే మెయిన్ అజెండాగా సమావేశం జరగనుంది.  

రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు Sankranthi Holidays పొడిగించారు. ఆరోగ్య శాఖ సూచన మేరకు జనవరి 30 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

మరి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు night curfew అమలు చేస్తున్నాయి. వీకెండ్ లో lockdown కూడా విధిస్తున్నాయి. ఇక మల్టీప్లెక్స్, థియేటర్ల విషయంలోనూ ఆంక్షలు అమలు చేస్తున్నాయి.  పలు చోట్ల కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా హాళ్లు నడుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. 

దీంతో నేడు జరగబోయే కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి కేబినెట్ సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. లాక్ డౌన్ వంటి నిర్ణయాలు లేకపోయినా.. నైట్ కర్ఫ్యూ విధించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తారని  తెలుస్తోంది.  ఇక వ్యాక్సినేషన్ అంశంపైనా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.  

ఇప్పటికే రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బూస్టర్ డోసులు,15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు టీకాలు కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ పలు చోట్ల సెకండ్ డోసు విషయంలో ఆలస్యం జరుగుతోంది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పలు మార్గదర్శకాలు  జారీ చేయనున్నారు.

ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించారు.  నివేదికపై చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే లాక్ డౌన్ విధించే అవకాశాలపై సైతం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మాస్కులు ధరించని, నిబంధనలను పాటించని వారికి భారీగా ఫైన్ లు విధించే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇంకా సభలు, సమావేశాలపై సైతం ఆంక్షలు పొడిగించే అవకాశం  ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే సంక్రాంతి వేడుకల నేపథ్యంలో కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో కేబినెట్ అత్యవసర భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా కట్టడి కోసం మంత్రివర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios