ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ

First Published 27, May 2018, 4:16 PM IST
telangana cabinet meeting at pragathi bhavan
Highlights

సాయంత్రం ఢిల్లీకి కేసిఆర్

ప్రగతి భవన్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశంలో పలు కీకల అంశాలపై చర్చ జరుగుతోంది. మంత్రిమండలి సమావేశానికి మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు. కొత్త జోనల్ విధానం, రైతుల జీవిత బీమా పథకం, కాళేశ్వరానికి అదనపు కేటాయింపులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

కేబినెట్ భేటీ తర్వాత సిఎం కేసిఆర్ ఢిల్లీకి పయనమవుతారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేసిఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కేసిఆర్ కలుసుకుంటారు. కొత్త జోనల్ విధానంపై ప్రధానితో డిస్కస్ చేస్తారు. అలాగే తెలంగాణకు రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపైనా మోదీతో చర్చిస్తారని చెబుతున్నారు.

 

loader