మాట నిలబెట్టుకున్న కేసీఆర్ : నెక్లెస్ రోడ్ పేరు మార్పు.. ‘‘ పీవీ నరసింహారావు మార్గ్‌’’గా నామకరణం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వున్న నెక్లెస్ రోడ్‌ పేరును ‘‘పీవీ నరసింహారావు మార్గ్’’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది

Telangana Cabinet has decided to rename the Necklace Road as PV Narasimha Rao Marg ksp

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వున్న నెక్లెస్ రోడ్‌ పేరును ‘‘పీవీ నరసింహారావు మార్గ్’’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. కాగా, నెక్లెస్ రోడ్‌కు పీవీ నరసింహారావు పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది ఆగస్టులోనే ప్రకటించారు. అందుకు తగినట్లుగానే ఇవాళ తన నిర్ణయానికి కేబినెట్‌లో ఆమోదముద్ర వేశారు కేసీఆర్.  

అంతకుముందు తెలంగాణలో మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే సడలింపు సమయాన్నిమూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. అన్ని వైపుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో దానిని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. 

Also Read:హెచ్‌సీయూకి పీవీ పేరు పెట్టండి... ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు చేరుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఆలోగా ప్రజలు ఇళ్లకు చేరుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా నేపథ్యంలో జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వైరస్ తీవ్రత తగ్గినప్పటికి.. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios