Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: వృద్ధాప్య పింఛను అర్హత 57 ఏళ్లకు తగ్గింపు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆరు గంటల పాటు సుదీర్ఘం సాగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పెన్షన్ అర్హత 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 6.62 లక్షల మందికి కొత్త పించన్లు అందనున్నాయి. 

Telangana Cabinet discussion on Dalit bandhu lns
Author
Hyderabad, First Published Aug 1, 2021, 3:23 PM IST

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆరు గంటల పాటు సుదీర్ఘం సాగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పెన్షన్ అర్హత 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 6.62 లక్షల మందికి కొత్త పించన్లు అందనున్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా వుండటంపై కేబినెట్‌లో చర్చించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దళితబంధుపై ప్రధానంగా చర్చించారు. పోడు భూముల అంశం, దళిత వాడల అభివృద్ది, మౌళిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, ఏపీతో నీటి వివాదం అంశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ విషయమై కూడా మంత్రిమండలి చర్చించింది.

రాష్ట్రంలో కరోనా పరి‌స్థి‌తులు, నూతన మెడి‌కల్‌ కాలే‌జీల ఏర్పాటు, ఉద్యో‌గాల భర్తీ తది‌తర అంశా‌లపై కేబినెట్ చర్చించింది. వీటి‌తో‌పాటు గత క్యాబి‌నెట్‌ సమా‌వే‌శంలో తీసు‌కున్న నిర్ణ‌యా‌లపై సమీ‌క్షించింది. రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యల పరిష్కారం కోసం  కొత్త  పథకం రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ ఉంటారు.కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని ఆదేశించింది కేబినెట్. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని కేబినెట్ ఆదేశించింది.

దేశంలో పలు రాష్ట్రాల పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతుల పై  కేబినెట్ చర్చించింది. ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి కేబినెట్ కు సమాచారాన్ని వైద్యశాఖాధికారులు అందించారు.ఆయా  జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్, మందులు, బెడ్స్, తదితర ఔషదాల లభ్యతపై కేబినెట్ చర్చించింది.

అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి సవివరంగా కేబినెట్ కు సమాచారం అందించారు వైద్యాధికారులు. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios