తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రిమండలి . శబరిమల, కాశీలలో వసతి గృహాల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రిమండలి. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్ రావ్ ఇతర మంత్రులతో కలిసి మీడియాకు తెలిపారు.
- గృహ లక్ష్మీ పథకం ద్వారా 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు
- రెండో విడత దళితబంధు 1 లక్ష 30వేల కుటుంబాలకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
- దళితబంధు వేడుకలను ఆగస్టు నెలలో ప్రతీ ఏటా నిర్వహించాలని నిర్ణయం
- 119 నియోజకవర్గల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో దళిత బంధు నిధులు పంపిణీ
- సొంత జాగ ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో ఆర్ధిక సాయం
- 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇవ్వాలని నిర్ణయం
- ప్రతీ ఇంటికి 3 లక్షల రూపాయలను గ్రాంట్ గా మూడు దఫాలుగా ఇవ్వాలని నిర్ణయం
- గృహలక్ష్మీ పథకం కోసం రూ.12 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపు
- కట్టే ఇళ్లన్నీ మహిళ పేరు మీద ఇవ్వాలని నిర్ణయం
- గత ఇందిరమ్మ పథకంలో రూ.4 వేల కోట్ల అప్పులను రద్దు చేస్తూ నిర్ణయం
- గొర్రెల పంపిణీకి సంబంధించి 7 లక్షల లబ్ధిదారుల్లో గతంలోనే 50 శాతం పూర్తి
- రూ. 4 వేల కోట్లకు పైగా మళ్ళీ నిధులు కేటాయింపు
- కలెక్టర్ పర్యవేక్షణలో గొర్రెల పంపిణీ
- 4 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1 లక్షా 55 వేల 393 మందికి పట్టాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం
- అంబేడ్కర్ విగ్రహం ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా ప్రారంభించాలని నిర్ణయం
- ఏప్రిల్ 14న భారీ బహిరంగ సభ
- జీవో 58, 59 ఒక్క రూపాయి లేకుండా పేదలకు ఇంటిపై హక్కును కల్పించాలని కేబినెట్ నిర్ణయం
- జీవో 58 కింద 1 లక్ష 45 వేల మందికి పట్టాలు ఇప్పటికే పంపిణీ
- కాశీలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఒక వసతి గృహం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఇందుకోసం రూ.25 కోట్ల నిధులు మంజూరు
- శబరిమలలోనూ రూ. 25 కోట్లతో వసతి గృహం నిర్మించాలని కేబినెట్ నిర్ణయం
- త్వరలోనే శబరిమలకు మంత్రుల బృందం
- గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయాన్ని ఆమోదించిన క్యాబినెట్.
