ఏప్రిల్ 14 న అంబేద్కర్ విగ్రహవిష్కరణ: తెలంగాణ కేబినెట్ లో కీలకాంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్  ఇవాళ  సమావేశమైంది. పలు కీలక అంశాలపై  ఈ సమావేశంలో  చర్చించారు.  కవితకు  ఈడీ నోటీసులపై  కూడా  చర్చ జరిగింది.  

Telangana Cabinet Approves To unveil Ambedkar Statue


హైదరాబాద్:  వచ్చే నెల 14వ తేదీన   అంబేద్కర్  విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని  ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్  నిర్ణయం తీసుకుంది . అదే విధంగా  తెలంగాణ సచివాలయాన్ని కూడా అదే రోజు  ప్రారంభించనుంది  ప్రభుత్వం.

తెలంగాణ కేబినెట్ సమావేశం   గురువారంనాడు  ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో  పలు అంశాలపై  చర్చించారు.  58,59 జీవోల  కింద  మరోసారి ధరఖాస్తు  చేసుకొనే  విషయమై  కేబినెట్ లో చర్చించారు. 

గవర్నర్ కోటాలో  ఇద్దరికి  ఎమ్మెల్సీ పదవుల  కేటాయింపుపై కేబినెట్ ఆమోదం  తెలిపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు  నామినేట్  చేసిన  ఇద్దరి పేర్లను  కొద్దిసేపట్లో  ప్రకటించే అవకాశం ఉంది.  మూడో విడత గొర్రెల పంపిణీ  విషయమై  ఈ సమావేశంలో  చర్చించినట్టుగా సమాచారం.

also read:ప్రారంభమైన తెలంగాణ కేబినెట్: కవితకు ఈడీ నోటీసులు సహా కీలకాంశాలపై చర్చ

మరికొన్ని రోజుల్లో  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఓటర్లను ఆకర్షించే పధకాలకు  కేసీఆర్  సర్కార్  శ్రీకారం చుట్టనుంది.స్వంత స్థలం  ఉన్న  వారు ఇంటి నిర్మాణం కోసం  రూ. 3 లక్షల ఆర్ధిక సహయం  చేస్తామని  బడ్జెట్ లో  ప్రకటించారు.ఈ విషయమై  కేబినెట్ లో  చర్చకు వచ్చిందని సమాచారం.

మరో వైపు రాజకీయ అంశాలపై కూడా  ఈ కేబినెట్ లో చర్చకు వచ్చినట్టుగా సమాచారం.   కవితకు ఈడీ నోటీసుల అంశంతో  పాటు గతంలో  పలువురు  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు  వచ్చిన  నోటీసులపై  కూడ చర్చ జరిగిందని సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios