Asianet News TeluguAsianet News Telugu

రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ... అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు

వచ్చే ఆర్థికసంవత్సరానికి(2021-22) సంబంధించి తెలంగాణ బడ్జెట్ ను ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 

Telangana budget2021 live updates
Author
Hyderabad, First Published Mar 18, 2021, 9:24 AM IST

2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2,30,825.96 కోట్ల వ్యయాన్ని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా ఇందులో రెవెన్యూ వ్యయవ రూ.1,69,383 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు. బడ్జెట్ అంచనాలల రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు, ఆర్థిక లోటు రూ.45,509.60 కోట్లు 

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్ స్ట్రిప్ ల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు 

హోంశాఖకు 6,465 కోట్ల రూపాయలు 

పౌరసరఫరా శాఖకు రూ.2,363 కోట్లు 

సాంస్క్రుతిక పర్యాటక శాఖకు రూ.726కోట్లు 

నూతన సచివాలయ నిర్మాణం కోసం 610 కోట్ల రూపాయలు 

కొత్తగా ఆర్వోబి, ఆర్ యూబీల కోసం రూ.400 కోట్లు 

రోడ్లు భవనాల శాఖకు 8,788కోట్లు రూపాయలు

దేవాలయాల అభివ్రుద్ది, అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సంక్షేమానికి 720 కోట్ల రూపాయలు 

వరదలకు దెబ్బతిన్న రోడ్ల  నిర్వహణ,మరమ్మతుల కోసం ఆర్ ఆండ్ బి రోడ్లకు రూ.800 కోట్లు, పంచాయితీ రాజ్ రోడ్లకు రూ.300 కోట్లు 

హైదరాబాద్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.725 కోట్లు 

అటవీ శాఖకు రూ.1,276 కోట్ల రూపాయలు

ఐటీ రంగానికి రూ.360 కోట్ల రూపాయలు 

ఆర్టీసికి రూ.1500 కోట్ల నిధులు కేటాయింపు... మొత్తంగా 3000వేల కోట్ల నిధులు సమకూర్చనున్నట్లు ప్రకటన

విద్యుత్ రంగానికి 11,046 కోట్ల రూపాయలు 

ఫార్మా రంగానికి 2,500 కోట్లు రూపాయలు 

పరిశ్రమల శాఖకు 3,077 కోట్ల రూపాయలు

తెలంగాణలో విద్యా రంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ 4,000 కోట్ల రూపాయిలతో సరికొత్త విద్యా పథకం 

పాఠశాలలకు అవసరమైన భవనాలు, మరమ్మతులు, ఫర్నీచర్, టాయిలెట్ల వంటి వసతులతో పాటు ఆధునిక సాంకేతికతతో పాఠశాలలో తరగతుల అనుసంధానం కోసం... ఈ విద్యాపథకం కోసం 2000 కోట్లు కేటాయింపు 

పాఠశాల విద్యకి 11,735 కోట్లు 

ఉన్నత విద్యారంగానికి 1,873 కోట్లు 

వైద్య ఆరోగ్య శాఖకు రూ.6,295 కోట్లు 

మూసీ నది పునరుజ్జీవనం, పరిసరాల సుందరీకరణకు రూ.200 కోట్లు 

మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ.1,000 కోట్లు 

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగు నీరు అందించేందుకు రూ.250 కోట్లు 

వరంగల్ కార్పోరేషన్ లో వివిధ అభివ్రుద్ది పనులకు రూ.250 కోట్లు, ఖమ్మం కార్పోరేషన్ కు రూ.150 కోట్లు 

పురపాలక మరియు పట్టణాబివ్రుత్తి శాఖకు మొత్తంగా రూ.15,030 కోట్లు 

హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరాకు రూ.250 కోట్లు 

సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు 

పట్టణాల్లో ఆధునిక సౌకర్యాలతో వైకుంఠధామాల నిర్మాణానికి రూ.200కోట్లు 

సమీక్రుత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు 

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రూ.11వేల కోట్లు

మహిళా, శిశు సంక్షేమం కోసం 1,702 కోట్లు

మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 3వేల కోట్లు

పోలీస్ స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 కోట్లు 

యూనివర్సిటీలలో చదువకునే విద్యార్థిణుల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లు... రూ.10 కోట్లు కేటాయింపు 

మైనార్టీ సంక్షేమానికి 1,606కోట్ల రూపాయలు 

బిసి కార్పోరేషన్ మరియు వెనుకబడిన తరగతుల కార్పోరేషన్ కు 1,000 కోట్లు 

బిసి సంక్షేమమ శాఖకు 5,522 కోట్ల రూపాయలు 

చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు 

నీరా పాలసీకి రూ.25కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో గొల్ల కుర్మలకు 3,000కోట్ల రూపాయలతో మరో మూడు లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ 

ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి 21,306.85 కోట్లు,

ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి 12,304.23 కోట్ల కేటాయింపు  

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ పథకానికి ఈ బడ్జెట్ లో రూ.2,750 కోట్లు 

ఆసరా పింఛన్ల కోసం కోసం 11,728 కోట్ల రూపాయలు కేటాయింపు 

సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు కేటాయింపు 

సాగునీటి రంగానికి ఈ బడ్జెట్ లో 16,931 కోట్ల రూపాయలు 

వ్యవసాయానికి 25 వేల కోట్ల రూపాయలు 

పశు సంవర్ధన మరియు మత్స్య శాఖకు  1,730 కోట్లు 

రైతు బంధు పథకం కోసం 14, 800 కోట్లు 

రైతు రుణమాపీకి రూ.5,225 కోట్లు 

తెలంగాణ బడ్జెట్ 2,30, 825.96 కోట్లు 

రెవెన్యూ మిగులు రూ.6,723.50 కోట్లు

రీజనల్ రింగ్ రోడ్డు హూసేకరణకు రూ.710కోట్లు

అటవీశాఖకు రూ. 1276 కోట్లు

ఆర్థిక లోటు  రూ.45,509

నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు

ఆర్టీసికి రూ.1,500 కోట్లు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజవర్గ నిధులుగా  5 కోట్లు,  ఇందుకోసం మొత్తంగా 800 కోట్లు కేటాయింపు

1000 కోట్ల నిధులతో షెడ్యూల్డ్ కులాలకోసం ప్రత్యేక పథకం

జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు 500 కోట్లు  

పంచాయితీ రాజ్ శాఖకు 29వేల కోట్లు 

రాష్ట్ర తలసరి ఆదాయం 2021-22కి 2లక్షల 25 వేలుగా అంచనా, ఇదే క్రమంలో 2021-22 లో దేశ తలసరి ఆదాయం1లక్షా 25వేలుగా అంచనా....

గతేడాది దేశ జిడిపి ‌-8.0  పడిపోయిందన్న హరీష్ , లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర జిడిపి కూడా గణనీయంగా తగ్గిన

అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యింది. నూతన రాష్ట్రం ప్రగతిపథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు హరీష్ రావు. ఏడెళ్ల వయసున్న తెలంగాణ ఏడు పదుల రాష్ట్రాలతో తెలంగాణ ఫోటీ పడుతోందన్నారు హరీష్ రావు. 

తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీష్ రావు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను ఛైర్మన్ కు అందించారు ఆర్థిక మంత్రి. 

తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బయలుదేరే ముందు జూబ్లీ హీల్స్ లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రితో పాటు అధికారులు  అసెంబ్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో అసెంబ్లీలో మంత్రి హరీష్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది. 

ఇవాళ(గురువారం) అసెంబ్లీలో వచ్చే ఆర్థికసంవత్సరానికి(2021-22) సంబంధించిన బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు మరికొద్దిసేపట్లో ఈ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకోనున్నారు. కరోనా కష్టకాలం 2020-21ఆర్థిక సంవత్సరంలో రూ.1,82,914 కోట్ల పద్దును ప్రతిపాదించగా ఈసారి  రూ.2.04 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. 

ఆర్థిక మంత్రి హరీష్ రావు హైదరాబాదులో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారు హైదరాబాదు వచ్చినట్లుందని ఆయన అన్నారు. బడ్జెట్ లో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు.

శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీలో మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios