రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి రూ. లక్ష కోట్ల బడ్జెట్, రెండోసారి రూ. లక్షా 30 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక బడ్జెట్ ను 13న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వస్తోన్న మూడో బడ్జెట్ ఇది. ఈ సారి కూడా సంక్షేమ రంగంపైనే ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2017-18 బడ్జెట్ మరింత గొప్పగా ఉంటుందని ఈటల రాజేందర్ గతంలోనే చెబుతూ వస్తున్నారు. సబ్ప్లాన్ నిబంధనలకు లోబడే దళిత, గిరిజన వర్గాలకు పూర్తి స్థాయి నిధులు కేటాయిస్తామన్నారు. రుణపరిమితికి లోబడే అప్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి రూ. లక్ష కోట్ల బడ్జెట్, రెండోసారి రూ. లక్షా 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
