Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్.. ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే...

ఐటీ రంగానికి 360 కోట్లు .. దేవాదాయ శాఖకు 720 కోట్లు.. హోమ్ శాఖకు 6465 కోట్లు

Telangana Budget: full details as per  category
Author
Hyderabad, First Published Mar 18, 2021, 12:56 PM IST

తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాగా... ఏయే రంగానికి ఎంత కేటాయించారు అనేది ఇక్కడ చూడొచ్చు.

మూసీ సుందరీకరణకు రూ.200 కోట్లు.. హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరాకు రూ.250 కోట్లు

మెట్రో రైలు కోసం రూ. 1000 కోట్లు.. పురపాలక, పట్టణాభివృద్ధి అభివృద్ధి కోసం రూ.15, 030 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖ కోసం రూ.6295 కోట్లు

పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు.. ఉన్నత విద్య కోసం రూ.1873 కోట్లు.. రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం

విద్యుత్ రంగానికి 11046 కోట్లు.. పరిశ్రమ శాఖ కు 3077 కోట్లు..

ఐటీ రంగానికి 360 కోట్లు .. దేవాదాయ శాఖకు 720 కోట్లు.. హోమ్ శాఖకు 6465 కోట్లు

ఆర్ అండ్ బీ కి రూ. 8,788 కోట్లు.. రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం రూ.750 కోట్లు

పౌర సరఫరాల శాఖకు రూ.2, 363 కోట్లు

చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు.. బీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు.. గీత కార్మికుల సంక్షేమానికి రూ.25 కోట్లు.. సాంస్కృతిక పర్యాటక రంగానికి 726 కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1502 కోట్లు

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లు

పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు

ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. ఈ సారి బడ్జెట్‌లో ఆ రంగానికి దాదాపు రూ. 25వేల కోట్లు కేటాయించింది. మరోసారి చేయూతనందించింది.ఈసారి బడ్జెట్‌లో రైతు బంధు కోసం రూ. 14, 800 కోట్లు కేటాయించగా.. రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు..  రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios