తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న శుక్రవారం నుండి సభ ప్రారంభమయింది. గవర్నర్ ప్రసంగం తరువాత నేడు మరల సమావేశాలు ప్రారంభమయింది. పౌరసత్వ సవరణ చట్టం పై చర్చ జరగాలని ఆల్రెడీ నిర్ణయించామని, ఒక రోజు కేటాయించుకున్నందున సభలోని సభ్యులంతా గొడవలకు పోకుండా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. 

తమపార్టీకి చెందిన ఎంపీలు ఇప్పటికే పార్లమెంటులో దాన్నివ్యతిరేకించమని, అదే తమ అభిప్రాయమని అన్నారు. అసెంబ్లీలో చర్చ జరగాలని, అప్పుడే ప్రజలకు అందరి వాదనలు అందులోని హేతుబద్దత తెలుస్తాయని అన్నారు. 

సభలో బీజేపీ తరుఫున ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, వారి అభిప్రాయాలను కూడా వినాలని, వారి వాయిస్ కూడా ప్రజలకు తెలపాలని కెసిఆర్ కోరారు. అక్బరుద్దీన్ గారైనా, రాజా సింగ్ అయినా తమ వాణిని వినిపిస్తేనే ప్రజలకు అర్థమవుతుందని, దాని తరువాత అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని ఆయన అన్నారు. 

Also read: "గుడ్డిలో మెల్ల" అంటూ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం చురకలు

తెలంగాణ స్పీకర్ మధ్యలో కలగచేసుకొని నేడు గవర్నర్ తీర్మానం పై మాత్రమే చర్చించాలని, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రత్యేక చర్చ చేపడదామని బీఏసీ లో కూడా తీర్మానం చేసినందున అజెండాపై మాత్రమే చర్చించాలని అన్నారు.

ఇక నిన్న తన ప్రసంగంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో చెప్పడంతోపాటుగా తెలంగాణ అభివృదిది పథంలో దూసుకుపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కారణం అని తెలిపారు. 

ప్రసంగాన్ని ముగించే తరుణంలో తెలంగాణ గంగా జమున తెహజీబ్ అని గుర్తు చేస్తూ ఆ విషయంపై ఒక కీలక విషయాన్నీ చెప్పారు. మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అంటూ.. ప్రతి మతాన్ని గౌరవిస్తామని, మాత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. 

తెలంగాణాలో అన్ని పండుగలను జరుపుకుంటారని, రాష్ట్రం కూడా అన్ని పండగలను జరుపుకోవడానికి వాతావరణం కల్పిస్తోస్తుందని, అన్ని మతాల వారు ఇక్కడ కలిసి మెలసి జీవిస్తున్నారని ఆమె అన్నారు. 

ఇలా ఒక రకంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎంత గట్టి నిర్ణయం తీసున్నాడో కెసిఆర్ మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రసంగం చదివింది గవర్నరే అయినా ఆ మాటలు రాష్ట్ర ప్రభుత్వానివే కదా!

ఇలా అమిత్ షా హైదరాబాద్ లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో సభ పెడుతా అని ప్రకటించిన నేపథ్యంలో ఇలా గవర్నర్ ప్రసంగంలో దాన్ని చేర్చడం కెసిఆర్ ఎంతటి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారో ఇక్కడ అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

గవర్నర్ ను కేంద్రం నియమిస్తుంది. కొన్ని రాష్ట్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా కూడా తయారవుతారు. కిరణ్ బేడీ ఉదంతం చూస్తే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఆవేదన చూస్తే మనకు ఇట్టే అర్థమయిపోతుంది. అలాంటి గవర్నర్ నోటితో కెసిఆర్ ఇలా కేంద్రానికి షాక్ ఇచ్చినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 

దేశ లౌకికత్వాన్ని కాపాడడానికి ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, తెలంగాణలో ఎట్టి పక్షంలోనూ ఆ పరిస్థితికి భంగం కలిగించే పనిని చేయబోమని ఆమె పునరుద్ఘాటించారు.