ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తన కుటుంబీకులని నిరంతరం ప్రజల గురించి ఆలోచించే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు గారిపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శలు చేయడం సరికాదని మంత్రి హరీష్ రావు అభిమానులు మండిపడ్డారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ తెగవైరలవుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేసిందే. దీంతో మంత్రి హరీష్ రావు అభిమానులు మండుతున్నారు. మంత్రి హరీశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు అభిమానులు మరో వినూత్న నిరసనకు తెర తీశారు.
ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ.. మైనంపల్లి హనుమంతరావును వెంటనే పార్టీ నుండి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తున్నాయి. ఈ తరుణంలో ట్విట్టర్ లో మైనంపల్లికి వ్యతిరేక హ్యష్ ట్యాగ్స్ ను వెలిశాయి. ప్రస్తుతం #WeAreWithHarishanna #SuspendMynampally అనే హ్యాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా #WeAreWithHarishanna అనే ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలిచింది.
ఇంతకీ మైనంపల్లి ఏమన్నారంటే..
తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు తన నియోజకవర్గాన్ని వదిలి పక్క జిల్లాలో పెత్తనం చేస్తున్నాడమేంటని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మల్కాజ్‌గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు( రోహిత్ రెడ్డి) పోటీ చేస్తామని తెలిపారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తా.. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా.. హరీష్ రావు తన గతాన్ని గుర్తించుకోవాలని, హరీశ్ తన నియోజకవర్గాన్ని వదిలి మెదక్ లో పెత్తనం చేస్తున్నాడనీ, అతడు ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. హరీష్ రావు అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడనీ, సిద్దిపేటలో హరీష్ రావు అడ్రెస్ గల్లంతు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిన్న చిన్న లీడర్లను రాజకీయంగా ఎదుగనివ్వకుండా వారిని అణిచివేశారని విమర్శించారు. మల్కాజిగిరిలో తాను.. మెదక్‌లో తన తనయుడు పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
మెదక్‌లో తన తనయుడు కచ్ఛితంగా గెలుస్తాడని దీమా వ్యక్తం చేశాడు. తాను బీఆర్ఎస్‌లోనే ఉంటాననీ, తనకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించిందని పేర్కొన్నాడు. వారి కుటుంబంలో కూడా చాలా మందికి టికెట్ ఇచ్చారనీ, తమద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని మైనంపల్లి హాట్ కామెంట్స్ చేశారు. గత కొన్నాళ్లుగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే..
