హైదరాబాద్: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో అమాయక విద్యార్థులు బలైపోయారు. హైకోర్టు మందలించినా కూడ ఇంటర్  బోర్డు నిర్లక్ష్యాన్ని మాత్రం వీడలేదు.  అనామిక అనే విద్యార్ధిని మార్కులను గంటల వ్యవధిలో బోర్డు మార్చేసింది. క్లరికల్ పొరపాటు అంటూ ఇంటర్ బోర్డు ప్రకటించింది.

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన అనామిక హైద్రాబాద్‌లోని అమ్మమ్మ ఇంటిలో ఉంటూ చదువుకొనేది.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ కావడంతో  అనామిక ఆత్మహత్యకు పాల్పడింది. 

ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో  మరోసారి జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ చేశారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలు కావడంతో  సుమారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

ఆత్మహత్యకు పాల్పడిన 23 మంది విద్యార్థులతో పాటు 53 జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా నిపుణులతో పున: పరిశీలన చేయించింది. ఆ సమయంలో అనామికకు తెలుగులో 20 మార్కులు వచ్చాయని తేలింది. పున : పరిశీలనలో ఒక మార్కుపెరిగి మొత్తం 21 మార్కులు వచ్చాయని బోర్డు వెల్లడించింది. కానీ, శనివారం నాడు ప్రకటించిన ఫలితాల్లో అనామిక ఉత్తీర్ణత సాధించిందని ప్రకటించింది.

అనామిక జవాబు పత్రాల పున: పరిశీలన చూస్తే 20 నుండి 48 మార్కులు పెరిగాయి. అనామిక తెలుగులో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన అనామికకు 48 మార్కులు వచ్చిన విషయాన్ని ఆమె సోదరి గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె మీడియా ముందు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన  ఇంటర్ బోర్డు పొరపాటు జరిగిందని ప్రకటించింది.

క్లరికల్ తప్పిదంతో  21కు బదులుగా 48 మార్కులు పెరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్ ప్రకటించారు. ఈ తప్పు ఎలా జరిగిందో విచారణ చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.