Asianet News TeluguAsianet News Telugu

ఆర్ఆర్ఆర్ మూవీ: బరిశెలతో తరిమికొడతాం.. రాజమౌళికి సంజయ్ వార్నింగ్

ఆర్ఆర్ఆర్ సినిమాపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కొమరం భీమ్‌ను కించపరిచేలా సినిమా తీస్తున్నారని.. సినిమా రిలీజ్ చేస్తే బరిశెలతో తరిమికొడతామని ఆయన హెచ్చరించారు

telangana bjp president bandi sanjay warning to ss rajamouli over RRR movie ksp
Author
Hyderabad, First Published Oct 31, 2020, 8:34 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమాపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కొమరం భీమ్‌ను కించపరిచేలా సినిమా తీస్తున్నారని.. సినిమా రిలీజ్ చేస్తే బరిశెలతో తరిమికొడతామని ఆయన హెచ్చరించారు.

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి తగిన గుణపాఠం తప్పదని సంజయ్ హెచ్చరించారు. కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే సినిమా రీళ్లను తగులబెడతామని వార్నింగ్ ఇచ్చారు.

థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా  ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌ను, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కొమరం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగే ఈ టీజర్‌కు రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ టీజర్ చివర్లో.. కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌ ఓ మతానికి సంబంధించిన టోపీ పెట్టుకుని కనిపించాడు.

దీంతో.. ఈ సన్నివేశాన్ని తొలగించాలని, లేని పక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు, బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios