బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు  ఉప ప్రాంతీయ పార్టీగా పేరుతెచ్చుకున్న టీఆర్ ఎస్ పార్టీతో జతకట్టడం జీర్ణించుకోలేమని అదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరో తోక పార్టీగా మారిపోతుందని భావిస్తున్నారట.

అవ్వ పెట్టదు... పెట్టనివ్వదూ అన్నట్టుంది తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి. గత ఎన్నికల్లో కారులోనే షికారు చేయాలని ఇక్కడి బీజేపీ నేతలు ప్రయత్నించినా చంద్రబాబు అండ్ కో ఒత్తిడి వల్ల అధిష్టానం సైకిల్ తోనే జతకట్టింది.

అసలే తెలంగాణ వ్యతిరేక పార్టీగా మంచి ఇమేజ్ పెంచుకున్న టీడీపీతో జతకట్టడంతో ఎన్నికల ఫలితాల్లో కమలం కకావికలమైంది. కాస్త సొంత ఇమేజ్ ఉన్న వారే గట్టెక్కారు.

అయితే వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో ఈ పరిస్థితి పునారవృతం కాకూడదని తెలంగాణ బీజేపీ నేతలు కాస్త గట్టిగానే నిర్ణయించారట.

ఇటీవల భద్రాచలంలో తెలంగాణ బీజేపీ నేతల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగిని విషయం తెలిసిందే. ఇందులో నేతలంతా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏలా దూసుకెళ్లాలనే అంశంపై లోతుగా చర్చించారు.

ఈసారి టీడీపీని నమ్మకోకుండా సొంతంగానే బరిలోకి దిగాలని కొంతమంది అభిప్రాయపడ్డారు. మోదీ ఇమేజ్ తో తెలంగాణలో బలమైన పార్టీగా బీజేపీ నిలదొక్కుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే మరికొందరు మాత్రం అనుకున్న ఫలితాలు రావాలంటే కారుతో జతకట్టాల్సిందేనని వాదిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరి మధ్య ఇప్పుడు మంచి సఖ్యత ఉందని, త్వరలో టీఆర్ఎస్ కూడా కేంద్ర మంత్రి వర్గంలో చేరుబోతుందనే వార్తలు వస్తున్నాయిని , ఈ నేపథ్యంలో మిత్ర పక్షంగా ఉండబోయే టీఆర్ఎస్ తో నే వచ్చే ఎన్నికల బరిలో దిగాలని అంటున్నారు.

ఇలా కారెక్కాలనే కమలనాథుల మాటలే ఈ సమావేశంలో గట్టిగా వినిపించాయట. అయితే సమావేశానికి వచ్చిన కొందరు పెద్దలు మాత్రం దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.

బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా పేరుతెచ్చుకున్న టీఆర్ ఎస్ పార్టీతో జతకట్టడం జీర్ణించుకోలేమని అదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరో తోక పార్టీగా మారిపోతుందని భావిస్తున్నారట.