రాజకీయాల్లోకి పరిపూర్ణానంద స్వామి..?

paripoornanda swami entering into politics?
Highlights

మీరు రాజకీయాల్లోకి అడుగుపెడతారా అని ఓ ప్రశ్నరాగా.. దానికి సమాధానంగా.. రాజకీయాల్లోకి తాను ప్రవేశించడం కాదు..తనలో, తన చుట్టుపక్కల రాజకీయం ప్రవేశించిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. 

స్వామి పరిపూర్ణానంద స్వామి రాజకీయాల్లోకి రానున్నారా..? కొద్ది రోజులుగా ఈరకమైన ప్రచారం కూడా మొదలైంది. దీనిపై ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనలో తన చుట్టుపక్కలా మొత్తం రాజకీయమే ఉందన్నారు.

శనివారం సింహాద్రి అప్పన్నను స్వామి పరిపూర్ణానంద దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారు కాబట్టే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. దేవాలయం కేంద్రంగా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వామి సేవలో అర్చకులు అతీతులు కారని...అపచారాలు చేస్తే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని పరిపూర్ణానంద హెచ్చరించారు

మీరు రాజకీయాల్లోకి అడుగుపెడతారా అని ఓ ప్రశ్నరాగా.. దానికి సమాధానంగా.. రాజకీయాల్లోకి తాను ప్రవేశించడం కాదు..తనలో, తన చుట్టుపక్కల రాజకీయం ప్రవేశించిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. 

loader