తన పొలిటికల్ ఎంట్రీపై శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరే విషయమై తన నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని ఆయన అన్నారు.

హైదరాబాద్: తన పొలిటికల్ ఎంట్రీపై శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరే విషయమై తన నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని ఆయన అన్నారు. తన జీవితంలో ఏ నిర్ణయమైనా అమ్మవారిదే ఆయన అన్నారు. 

దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తానని పరిపూర్ణానంనద అన్నారు. అందరితో చర్చలు జరుపుతున్నానని, అన్ని విషయాలపై క్షుణ్నంగా చర్చించిన తర్వాతనే అడుగులు వేస్తానని ఆయన అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆహ్వానిస్తే నిస్వార్థంగా దేశం, ధర్మం కోసం పని చేస్తానని చెప్పారు. 

పీఠాధిపతిగా ఉత్కృష్టమైన స్థానాన్ని వదులుకోనని, అమ్మవారి నిర్ణయం ప్రకారం నడుస్తానని అన్నారు. తన 46 ఏళ్ల జీవితంలో ప్రతి ఒక్కదాన్ని భగవంతుని నిర్ణయానికే వదిలేశానని చెప్పారు.